PMKSY: కేంద్రప్రభుత్వం ప్రారంభించిన పీఎంకేసి పథకం..! 4 d ago

ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన- యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ (PMKSY- AIBP)లో బీహార్ లోని కోసి-మేచి ఇంట్రా- స్టేట్ లింక్ ప్రాజెక్ట్ను చేర్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రూ.6,282.32 కోట్ల అంచనా వ్యయం గల ఈ ప్రాజెక్టును 2029 మార్చికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం బీహార్ కు రూ.3,652.56 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా కోసి మిగులు జలాల్లో కొంత భాగాన్ని బీహార్ లోని మహానంద బేసిను తరలించనున్నారు. ఇందుకోసం తూర్పు కోసి ప్రధాన కాలువను పునర్నిర్మించనున్నారు.
కోసి మేచి ఇంట్రాస్టేట్ లింక్ ప్రాజెక్ట్:
కోసీ నది మిగులు నీటిలో కొంత భాగాన్ని మెచి నదికి అనుసంధానించడం ద్వారా బీహార్ లోని మహానంద బేసిన్‌కు మళ్లించడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న తూర్పు కోసీ ప్రధాన కాలువ (EKMC) పునర్మించి, విస్తరిస్తారు. తూర్పు కోసీ ప్రధాన కాలువ భారతదేశం - నేపాల్ మధ్య కోసి ప్రాజెక్ట్ (1954)లో ఒక భాగం.
PMKSY పథకాన్ని 2015-16లో కేంద్రప్రభుత్వంచే ప్రారంభించబడింది. దీని ప్రధాన లక్ష్యాలు.. పొలంలో నీటి లభ్యతను మెరుగుపరచడం, నీటిపారుదల సౌకర్యాలతో సాగు భూమి విస్తీర్ణాన్ని విస్తరించడం, పొలంలో నీటి వినియోగ సామర్థాన్ని మెరుగుపరచడం, స్థిరమైన నీటి సంరక్షణ పద్ధతులను ప్రవేశ పెట్టడం మొదలైనవి.
కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ (AIBP), హర్ ఖేత్ కో పానీ (HKKP). గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా వాటర్డ్ డెవలప్మెంట్ (WD) అమలు చేస్తోంది. AIBP 1996-97లో ప్రారంభించబడగా, 2015-16లో PMKSY పథకంలో విలీనం చేశారు. నాబార్డ్ నుంచి రుణాలతో, దీర్ఘకాలిక నీటిపారుదల నిధి కింద ప్రధాన, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్ర సహాయం అందించడం దీని ప్రధాన లక్ష్యం.
కోసి నది టిబెట్ లో ఉద్భవించి, నేపాల్ గుండా హిమాలయ పర్వతాలు, బీహార్ దిగువ మైదానాలలో ప్రవహించి గంగా నదిలో కలుస్తుంది. సన్ కోసి, అరుణ్ కోసి, తమూర్ కోసి, మేచి నది కోసికి తూర్పున ప్రవహించే జీవనది(సంవత్సర కాలం ప్రవహిస్తుంది) కోసి నది ప్రధాన ఉపనదులు. ఇది మహానంద నదికి ఉపనది.